2016 టాప్ హీరోలు !

- December 28, 2016 , by Maagulf
2016 టాప్ హీరోలు !

గడిచిపోతున్న ఈ ఏడాది టాప్ యంగ్ హీరోలలో కొంతమందికి నిరాశను మిగిలిస్తే మరికొంత మందికి ఆశలను చిగురింప చేసింది. ముఖ్యంగా పవన్ మహేష్ లకు ముగింపుకు వస్తున్న ఈ సంవత్సరం ఒక పీడకల. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రం తాను కలలు కన్న రికార్డులను ఇచ్చిన సంవత్సరంగా తారక్ ఈ సంవత్సరం మిగిలిపోతుంది.
ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కు 'సింహాద్రి' తరువాత సరైన బ్లాక్ బస్టర్ హిట్ తగలకపోవడంతో జూనియర్ మాస్ ఆకర్షణ తగ్గిందా ? అన్న అనుమానాలు కూడ వ్యక్తం అయ్యాయి. అయితే ఆ అనుమాలను తీసి పారేస్తూ కలక్షన్స్ రికార్డులను క్రియేట్ చేయడంలోనే కాదు నటుడుగా తనను తాను నిరూపించుకునే అవకాశం జూనియర్ కు 'జనతా గ్యారేజ్' ఇచ్చింది.

ఈ ఏడాది బాగా కలిసి వచ్చిన హీరోలలో అల్లు అర్జున్ ప్రధమ స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది సమ్మర్ రేస్ కు వచ్చిన 'సరైనోడు' డివైడ్ టాక్ తెచ్చుకున్నా సమ్మర్ రేస్ లో టాప్ హీరోగా మారడమే కాకుండా బన్నీ కెరియర్ లోనే ఎప్పుడూ చూడని కలక్షన్స్ ను 'సరైనోడు' ఇచ్చింది అంటే అల్లు అర్జున్ ఎంతటి అదృష్ట వంతుడో అర్ధం అవుతుంది. అయితే ఈ సంవత్సరం రామ్ చరణ్ కు 'ధృవ' ద్వారా పేరును తెచ్చి పెట్టింది కాని చరణ్ కోరుకున్న రికార్డులను మాత్రం ఇవ్వలేకపోయింది.
ఇక మరొక రెండు రోజులలో ముగిసి పోతున్న 2016 మాత్రం నాగార్జునకు కలలో కూడ ఊహించని అదృష్టాన్ని ఇచ్చింది. టాలీవుడ్ సినిమా ఎంట్రీ ఇచ్చి 30 సంవత్సరాలు దాటిపోయినా నాగార్జున ఎసినిమాకు రానటువంటి భారీ కలక్షన్స్ ను ఈ ఏడాది సంక్రాంతి రేస్ కు వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' ఇవ్వడమే కాకుండా నాగార్జునను 50 కోట్ల హీరోగా ఈ సంవత్సరం మార్చివేసింది.
ఇక టాలీవుడ్ యంగ్ హీరోల పరిస్థితిని పరిశీలిస్తే ఈ సమ్మర్ రేస్ కు వచ్చిన 'అ ఆ' నితిన్ ను 40 కోట్ల హీరోగా మారిస్తే ప్రజల పడుతున్న నోట్ల కష్టాల మధ్య విడుదలైన 'ఎక్కడకు పోతావు చిన్నవాడా' నిఖి ను 30 కోట్ల హీరోగా చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 'పెళ్ళి చూపులు' సినిమాతో విజయ్ దేవరకొండ సర్ప్రైజింగ్ క్రేజీ యంగ్ హీరోగా మారిపోయాడు.
ఈసినిమాకు కోటి రూపాయలు పెట్టుబడి పెడితే దాదాకు 25 కోట్లకు పైగా కలక్షన్స్ ఈసినిమాకు వచ్చాయి అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈసినిమాకు వచ్చినన్ని లాభాలు 2016 లో మరి ఏ భారీ సినిమాకు రాకపోవడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ 'సర్ప్రైజింగ్ స్టార్ ఆఫ్ 2016' గా పిలవబడుతున్నాడు. ఏది ఎలా చూసుకున్నా ఈ సంవత్సరం టాప్ హీరోల లిస్టులో ఫెయిల్యూర్స్ వల్ల మహేష్ - పవన్ లు లేకపోవడం ప్రభాస్ నటించిన 'బాహుబలి 2' రిలీజ్ కాకపోవడంతో టాప్ హీరోల లిస్టులో ఈ ముగ్గురు హీరోలు లేకపోవడంతో వీరి అభిమానులకు నిరాశ కలిగించే విషయమే..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com