అల్ ఖోర్‌లో క్వాలిటీ మాల్ ప్రారంభం..
- December 28, 2016
జనవరి 1న ఖతార్‌లో ఏడవ రిటైల్ ఔట్‌లెట్‌ని ప్రారంభించనున్నట్లు క్వాలిటీ గ్రూప్ ప్రకటించింది. ఉదయం 11 గంటలకు క్వాలిటీ మాల్ ప్రారంభం కానుంది. క్వాలిటీ గ్రూప్ ఛైర్మన్ షంసుద్దీన్ ఒలకారా మాట్లాడుతూ, మూడు అంతస్తుల క్వాలిటీ మాల్ 14,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపొందించబడింది. ఇండిపెండెంట్ కియోస్క్‌లు, పలు ఔట్‌లెట్స్, ఫ్రాంఛైజీస్, ఇంకా చాలా షాపింగ్ స్పేస్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. క్వాలిటీ మాల్‌లో పార్కింగ్ ఏరియా 300 కార్ల కోసం ఏర్పాటు చేయబడింది. క్వాలిటీ హైపర్ మార్కెట్‌లో ఫుడ్ ఐటమ్స్, రగాసరీస్, హౌస్‌హోల్డ్ వేర్స్ వంటివి లభ్యమవుతాయి. బ్యూటీ సెలూన్స్, కాన్ఫెక్షనరీస్, లాండ్రీ, ఫార్మసీ మరియు ఫుడ్ కోర్ట్‌ని ఇందులో ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 50కి పైగా రిటైల్ ఔట్‌లెట్స్ కూడా ఉన్నాయి. వక్రాలో మరో హైపర్‌మార్కెట్‌ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఒలకారా చెప్పారు. మలేసియాలో తమ గ్రూప్‌కి చెందిన తొలి హైపర్ మార్కెట్‌ని మార్చ్ - ఏప్రిల్‌లో ప్రారంభించనున్నారు. కౌలాలంపూర్‌కి 75 కిలోమీటర్ల దూరంలో ఇది ఏర్పాటవుతోంది. అబుదాబీలో రిటైల్ మార్కెట్ రంగంలోకి కూడా క్వాలిటీ గ్రూప్ ప్రవేశిస్తోంది. క్వాలిటీ గ్రూప్ ఇంటర్నేషనల్ ఇండియాలోని బెంగళూరులో ఇప్పటికే ఓ హైపర్ మార్కెట్‌ని నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!







