నివాస సంబంధ పెట్టుబడుల్లో యూ. ఏ. ఈ. కి ప్రపంచంలో రెండవ స్థానం

- September 08, 2015 , by Maagulf
నివాస సంబంధ పెట్టుబడుల్లో యూ. ఏ. ఈ. కి ప్రపంచంలో రెండవ స్థానం

అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సలహాదారు ఐన సావీ ల్స్ యొక్క తాజా ర్యాంకింగ్స్ ప్రకారం,  ప్రపంచ స్థాయి నివాస సంబంధ పెట్టుబడుల్లో యూ. ఏ. ఈ.  రెండవస్థానాన్నాక్రమించింది; కాగాఆయా దేశాల ఆర్ధికాభివృద్ధి, మార్కెట్ రికవరీ ప్రకారం అమెరికా మొదటి స్థానంలోను, సింగపూర్ రెండవ స్థానంలోను ఉన్నాయి. దుబాయి లాండ్ డిపార్ట్‌మెంట్ వారి ఇటీవలి పరిశోధన ప్రకారం 2015 సంవత్సర ప్రధమార్ధంలో 142 దేశాల లోని, 19,848 మంది పెట్టుబడిదారుల నుండి రియల్ ఎస్టేట్ పెట్టుబడులు 53 బిలియన్ దిర్హమ్ లను దాటాయి.  వీరిలో 7.8 బిలియన్ దిర్హమ్ లు భారత్ వి కాగా, అనంతరం బ్రిటన్ మరియు పాకిస్తాన్ ఉన్నాయి. ఇది దుబాయి మరియు యూ. ఏ. ఈ. అనుసరిస్తున్న విభిన్న విధానాల ఫలితమని, ప్రపంచ వ్యాప్త కొనుగోలుదారులను ఆకర్షించే సామర్ధ్యం గల దుబాయి రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇందుకు నిదర్శనమని దుబాయి లాండ్ డిపార్ట్‌మెంట్ డైరక్టర్ జనరల్ సుల్తాన్ బట్తి బిన్ మెజ్రెన్ విశ్లేషించారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com