అరుణాచల్ ప్రదేశ్ సీఎం సస్పెండ్!
- December 30, 2016
అరుణాచల్ ప్రదేశ్‌లో రాజకీయ అనిశ్చితి ఇప్పట్లో తొలిగేట్టు కనిపించడం లేదు. గతేడాది డిసెంబర్ నుంచి మళ్లీ డిసెంబర్‌లోగా అక్కడ రాజకీయ సమీకరణాలు చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. తాజాగా ముఖ్యమంత్రి పెమా ఖండూతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు అధికార పార్టీ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ (పీపీఏ) ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లఘిస్తున్నారంటూ గురువారం సాయంత్రం వీరిపై వేటువేసింది. పెమా ఖండూతో పాటు మరో 42 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు గత సెప్టెంబర్‌లోనే గంపగుత్తగా వచ్చి పీపీఏలో చేరిన సంగతి తెలిసిందే. సస్పెన్సన్ వేటుతో ఇకపై పెమా ఖండూకి శాసనసభా పక్ష నేతగా పార్టీ తరపున ఎలాంటి అధికారం ఉండబోదని పీపీఏ అధ్యక్షుడు కాఫియా బెంజియా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







