అరుణాచల్ ప్రదేశ్ సీఎం సస్పెండ్!

- December 30, 2016 , by Maagulf
అరుణాచల్ ప్రదేశ్ సీఎం సస్పెండ్!

అరుణాచల్ ప్రదేశ్‌లో రాజకీయ అనిశ్చితి ఇప్పట్లో తొలిగేట్టు కనిపించడం లేదు. గతేడాది డిసెంబర్ నుంచి మళ్లీ డిసెంబర్‌లోగా అక్కడ రాజకీయ సమీకరణాలు చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. తాజాగా ముఖ్యమంత్రి పెమా ఖండూతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు అధికార పార్టీ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ (పీపీఏ) ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లఘిస్తున్నారంటూ గురువారం సాయంత్రం వీరిపై వేటువేసింది. పెమా ఖండూతో పాటు మరో 42 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు గత సెప్టెంబర్‌లోనే గంపగుత్తగా వచ్చి పీపీఏలో చేరిన సంగతి తెలిసిందే. సస్పెన్సన్ వేటుతో ఇకపై పెమా ఖండూకి శాసనసభా పక్ష నేతగా పార్టీ తరపున ఎలాంటి అధికారం ఉండబోదని పీపీఏ అధ్యక్షుడు కాఫియా బెంజియా పేర్కొన్నారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com