సిడ్నీ నూతన సంవత్సర వేడుకలకు బెదిరింపు..

- December 30, 2016 , by Maagulf
సిడ్నీ నూతన సంవత్సర వేడుకలకు బెదిరింపు..

సిడ్నీలో కొత్త ఏడాది వేడుకల్లో బాంబులు పేలతాయంటూ సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డ ఓ వ్యక్తిని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్టు చేశారు. నూతన సంవత్సరానికి స్వాగతం చెప్తూ ప్రపంచంలో తొలి వేడుకలు జరిగేది ఆస్ట్రేలియాలోని సిడ్నీలోనే. 31వ తేదీ రాత్రి యావత్‌ ప్రపంచం అక్కడి వేడుకలను ఆసక్తిగా గమనిస్తుంటుంది. దాంతో ఈ బెదిరింపులను తీవ్రంగా పరిగణించిన పోలీసులు విచారణ జరిపి 40 ఏళ్ల ఓ వ్యక్తిని సిడ్నీ ఎయిర్‌పోర్టు వద్ద అరెస్టు చేశారు. అతను అప్పుడే లండన్‌నుంచి వచ్చాడని వారు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com