యంగ్ హీరోతో నాగ్ మల్టీ స్టారర్..
- December 30, 2016
సీనియర్ హీరోల్లో ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే స్టార్ కింగ్ నాగార్జున. రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ నుంచి భక్తిరస చిత్రాల వరకు.. ఇప్పటికీ అన్ని రకాల పాత్రల్లో అలరిస్తున్న నాగార్జున, యంగ్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలకు రెడీ అవుతున్నాడు. గతంలో కొన్ని సినిమాలో గెస్ట్ అపియరెన్స్ లు ఇచ్చిన ఈ మన్మథుడు.. ఇప్పుడు ఓ సక్సెస్ ఫుల్ యంగ్ హీరోతో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడట.
ప్రస్తుతం టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నయంగ్ హీరో నిఖిల్. స్వామిరారా, కార్తీకేయ, ఎక్కడికీపోతావు చిన్నవాడా లాంటి సినిమాలతో డిఫరెంట్ జానర్ లో దూసుకుపోతున్న ఈ యువ కథానాయకుడు సీనియర్ స్టార్ నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడట.
నిఖిల్ హీరోగా కార్తీకేయ సినిమాను తెరకెక్కించిన చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!
- సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- కువైట్ లో వేర్వేరు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..!!
- రియాద్ ఎక్స్పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!
- రోడ్డుపై ట్రక్కు బోల్తా..ప్రయాణికులకు అలెర్ట్..!!







