'మిస్టర్ వరల్డ్ పోటీలకు వెళ్తా.. సాయం చేయండి'
- December 30, 2016
మిస్టర్ వరల్డ్ టైటిల్ పోటీల్లో పాల్గొనేందుకు తనకు ఆర్థిక సహాయం చేయాలని బాడీ బిల్డర్ జి.అయ్యప్ప శాట్స్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం ఎల్బీ స్టేడియంలోని శాట్స్ కార్యాలయంలో చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డిని కలిసిన అయ్యప్ప ఈ మేరకు కోరారు. ఏడుసార్లు మిస్టర్ తెలంగాణగా ఎంపికైన అయ్యప్ప 2015లో మిస్టర్ ఇండియా నేషనల్ జూనియర్స్ 70కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. ఈ ఏడాది జాతీయ సీనియర్ 75 కిలోల్లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మిస్టర్ వరల్డ్ పోటీలకు సన్నద్ధమై, హాజరయ్యేందుకు తనకు ఆర్థిక స్థోమత లేదని 26 ఏళ్ల అయ్యప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుగ్గాను నెలకు రూ.30 వేల వంతున ఏడాదిపాటు తనకు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలని శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశాడు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







