కశ్మీర్లో అల్లర్లు: ఎనిమిది మందికి గాయాలు..
- December 30, 2016
కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో చెలరేగిన అల్లర్లలో ఇద్దరు భద్రతాసిబ్బంది సహా ఎనిమిది మంది ఆందోళనకారులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గలందర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని చట్టుముట్టాయి. తనిఖీల్లో భాగంగా జాతీయరహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలను సైతం నిలిపివేశారు. అయితే ఈ సమయంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో వారిని అదుపుచేసేందుకు భద్రతాదళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. గాల్లోకి కాల్పులు జరిపారు.దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇద్దరు ఆందోళనకారులకు బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







