ఇది భారత్‌కు ప్రమాదకరం: నిఘావర్గాలు..
- December 30, 2016
ఇరాక్, సిరియాలలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ఇటీవలి కాలంలో సంకీర్ణ బలగాల చేతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల నుంచి సిరియా, ఇరాక్‌లకు వెళ్లి అక్కడ ఇస్లామిక్ స్టేట్ తరఫున పోరాడుతున్న వారు.. తిరిగి స్వదేశాలకు పయనమయ్యే అవకాశాలు పెరిగాయని తెలుస్తోంది. భారత్ నుంచి వెళ్లి ఇస్లామిక్ స్టేట్ తరఫున పోరాడుతున్న వారి సంఖ్య 40 నుంచి 50 మంది వరకు ఉంటుందని ఇంటలిజెన్స్ ఏజెన్సీలు అంచనావేస్తున్నాయి.
సంకీర్ణ సేనల దాడులతో ఇస్లామిక్ స్టేట్ తమ ప్రాబల్యం కలిగిన ప్రాంతాలను క్రమంగా కోల్పోతున్న నేపథ్యంలో భారత్ నుంచి వెళ్లిన యువత తిరిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ సీనియర్ ఇంటలిజెన్స్ అధికారి వెల్లడించారు.
యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించి.. ఇస్లామిక్ స్టేట్‌తో పూర్తిగా ప్రభావితమై ఉన్న వీరు.. దేశంలో ఉగ్రచర్యలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుత ఆన్‌లైన్ రాడికలైజేషన్ ట్రెండ్ కన్నా ఇది ప్రమాదకరమైనది అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







