కేన్సర్‌పై చైతన్యం..!
- December 30, 2016
సమాజానికి పెనుభూతంగా మారిన కేన్సర్ పట్ల చైతన్యం అవసరమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పిలుపునిచ్చారు. ఇంటివద్దకే కేన్సర్ పరీక్షల సౌకర్య విభాగాన్ని శుక్రవారం బెంగళూరులో లాంఛనంగా ప్రారంభించారు. అదమ్యచేతన సేవా ఉత్సవ్‌లో భాగంగా శంకర్ కేన్సర్ పరిశోధనా సంస్థ, అదమ్యచేతనల సంయుక్త సహకారంతో ఇంటివద్దకే కేన్సర్ పరీక్షల వి భాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ శంకర్ కేన్సర్ ఆసుపత్రి దేశంలోనే పేరొందిన సంస్థ అని కితాబునిచ్చారు. కేన్సర్ మహమ్మారి సా మా న్యుల పాలిట శాపంగా మారిందన్నారు. కేన్సర్‌ను పూర్తిగా నిర్మూలించే పరిశోధనలు విజయవంతం కావాలని సూచించారు. పరిశోధనలకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఇ ప్పటికీ పూర్తిస్థాయిలో అదుపు చేసే విధానాలు రాలేదని విచారం వ్యక్తం చే శారు.
కేన్సర్‌కు తగిన ఔషధాలు కనుగొనలేకపోయారని ఆవేదన తెలిపారు. కేన్సర్ పట్ల సమాజంలో చైతన్యం ఒక్కటే మార్గమన్నారు. ఇంటి వద్దకే కేన్సర్ పరీక్షల విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పల్లె ప్రాంతాల ప్రజలకు ఒక అవగాహన కల్పించినట్లు అవుతుందన్నారు. ఇం టింటా పరీక్షలు జరపడమే కాకుండా కేన్సర్ ఏ విధంగా వస్తుందనేది తెలపాల్సి ఉందన్నారు.
ఇదే సందర్భంగా గవర్నర్ వాజుభాయ్‌వాలా మా ట్లాడుతూ భవిష్యత్తులో కేన్సర్‌ను నివారించే మందులు సాధ్యమనే విశ్వాసం వ్యక్తం చేశారు. స్వార్థం లేకుండా ఇతరుల సంక్షేమం కోసం పనిచేయడం మానవత్వానికి నిదర్శనమన్నారు. సర్వేజనా సుఖినోభవంతు తరహాలో సేవలు అందిస్తున్న అదమ్యచేతన సంస్థను కొనియాడారు. ప్రతి వ్యక్తి పేదరికం నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యంలో నూతన విప్లవాలు సాధ్యం చేసేందుకు పలు విధాలుగా యత్నిస్తున్నామన్నారు. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రతి వ్యక్తికి ఆరోగ్యం అందించాలన్నదే తమ లక్ష్య ం అన్నారు. అనంతరం అదమ్యచేతన సం స్థకు అనుబంధంగా ఉండే హసిరు-అడిగె (గ్రీన్ కిచెన్‌ను) పరిశీలించారు.
కేంద్రమంత్రి అనంతకుమార్, అదమ్యచేతన అ ధ్యక్షురా లు తేజస్విని అనంతకుమార్, శంకర్ కేన్స ర్ ఆసుపత్రి అధ్యక్షుడు డా.బి.ఎ్‌స.శ్రీనాథ్, రాష్ట్రపతి కుమార్తె ప్ర మీలా ముఖర్జీలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







