బాలయ్య అభిమానులుకు షాక్ ఇచ్చిన నాగబాబు కామెంట్స్..
- December 30, 2016
2017 సంక్రాంతి పండుగ భారీ సినిమాల రేస్ చిరంజీవి బాలకృష్ణలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో ఈ వార్ మెగా నందమూరి అభిమానుల మధ్య చిచ్చు రేపుతోంది. దీనితో 'ఖైదీ' 'శాతకర్ణి' సినిమాల మధ్య నడుస్తున్న పోటీ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు సెన్సార్ కార్యక్రమాలను కూడ పూర్తి చేసుకున్న 'ఖైదీ' నిర్మాతలు రకరకాల ఎత్తుగడలతో సంక్రాంతి రేస్ విజేతగా మారడానికి వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో ఈ సినిమాల మధ్య రికార్డు కలెక్షన్స్ పోటీతో పాటు ఈ రెండు సినిమాల మధ్య కనీవినీ ఎరుగని థియేటర్స్ వార్ నడుస్తోంది.
ఈ సమయంలో మెగా బ్రదర్ నాగబాబు అభిమానులతో పాటు ప్రేక్షకులను ఉద్దేశించి ఈ సంక్రాంతి సినిమాల మధ్య పోటీ గురించి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి.
'ఒక సినిమా తెరకెక్కడంలో వేల మంది కష్టం ఉంటుంది. మూవీ ఫ్లాప్ అవడం చాలామందిని చాలా బాధపెడుతుంది. ఒక సినిమా హిట్ అవాలని కోరుకోవడం సహజం. కానీ మన సినిమా మాత్రమే ఆడాలని కోరుకోవడం మాత్రం దారుణమే కాదు స్వార్ధం కూడ పరిశ్రమకు ఇది ఏమాత్రం మంచిదికాదు. అభిమానులు మంచి సినిమాలను ఆదరించాలి. ఇప్పుడు నడుస్తున్న ఫ్యాన్ వార్స్ ట్రెండ్ ఏమాత్రం సరికాదు' అంటూ డైరెక్టుగానే అభిమానులకు మెసేజ్ ఇచ్చేశాడు నాగబాబు.
అంతేకాదు 'సంక్రాంతికి అతి పెద్ద పండుగ. ఈ సీజన్ లో మూడు సినిమాలు భారీ సక్సెస్ లు సాధించి బ్లాక్ బస్టర్లుగా నిలిచేందుకు అవకాశం ఉంది. ఈ పండుగ అందరికీ సంతోషంతో పాటు సూపర్ హిట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా' అంటూ నందమూరి ఫ్యాన్స్ కి కూడా విషెస్ చెప్పాడు మెగా బ్రదర్. దీనితో నాగబాబు చేసిన ఈ కామెంట్స్ పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. నాగబాబు యధాలాపంగా ఈ మాటలు అన్నాడా? లేదంటే ఈ మాటల వెనుక ఏమైనా వ్యూహాత్మక ఎత్తుగడ ఉందా అన్న కోణంలో చర్చలు సాగుతున్నాయి.
ఏది ఏమైనా నాగబాబు చేసిన కామెంట్స్ అటు మెగా కాంపౌండ్ కు అదే విధంగా నందమూరి అభిమానులకు షాక్ ఇస్తాయి అన్నది వాస్తవం. మరి ఈ కామెంట్స్ పై మెగా కాంపౌండ్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి..
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







