ప్రజాదరణ పొందుతున్నవి చిన్న సినిమాలు..
- December 30, 2016
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలే ప్రజాదరణ పొందుతున్నాయని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా తక్కువ బడ్జెట్‌లోనేచాలా మంచి సినిమాలు వస్తున్నాయి. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చాలా బాగుంది. 'నాన్న నేను నా బోయ్‌ఫ్రెండ్స్' ఎంతో చక్కగా ఉంది. ఇందులో అందరూ చాలా బాగా నటించారు. నేటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని తీసిన సినిమా ఇది. ప్రస్తుతం ప్రేమ.. పెళ్లి విషయాల్లో అమ్మాయిలు, అబ్బాయిల విధానాల్లో మార్పు వచ్చాయి. 40 రోజుల్లో తక్కువ బడ్జెట్‌తో తీసిన 'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్' కథను ఎంతో చక్కగా తెరకెక్కించారు అన్నారు.
గత కొంత కాలంగా వారానికి ఒకే రోజు నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్నారు. ఆలోచించి పక్కా ప్రణాళికతో సినిమాను రూపొందించుకోవాలని సూచించారు. రావు రమేష్ గురించి మాట్లాడుతూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ భాస్కర్ బండి, నిర్మాత వేణుగోపాల్, రచయతలు సాయికృష్ణ, ప్రసన్నకుమార్, హీరోలు అచ్చింబాబు, నోయల్, అడిటర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







