బాధ్యతలు స్వీకరించిన వాయుసేన, సైన్యం కొత్త అధిపతులు..
- December 31, 2016
భారతీయ వాయుసేన, సైనిక దళాలకు కొత్త అధిపతులు శనివారం బాధ్యతలు స్వీకరించారు. సౌత్ బ్లాక్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో జనరల్ బిపిన్ రావత్ భారత సైనిక దళాల అధిపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ పదవీ విరమణ చేయడంతో ప్రభుత్వం జనరల్ బిపిన్ రావత్‌ను నియమించింది. వాయుసేన ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా భారతీయ వాయుసేన అధిపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా స్థానంలో ధనోవాను ప్రభుత్వం నియమించింది. ఈ నియామకాలకు సంబంధించిన ప్రభుత్వ ప్రకటన ఈ నెల 16న వెలువడింది. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ అధిపతిగా నావికాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా వ్యవహరిస్తారు.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







