త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా ఖరారు!
- December 31, 2016
జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై తీవ్ర ఆసక్తి నెలకొంది. జనతా అంతటి సక్సెస్ సాధించేలా తన తరువాతి సినిమా ఉండాలని భావించిన జూనియర్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్లతో ఆ సినిమా చేయాలనుకున్నాడు. దానిలో భాగంగానే, త్రివిక్రమ్‌తో కూడా చేయాలనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్టుకు త్రివిక్రమ్ సిద్ధంగా లేడని, అది కుదిరే పని కాదని గతంలో వార్తలు వచ్చాయి.
అయితే, ఈ కాంబినేషన్లో సినిమా ఉందని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ హాసిని అండ్ హారిక క్రియేషన్స్ అధిపతి సూర్యదేవర రాధాకృష్ణ ప్రకటించారు. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో రానున్న తొలి చిత్రాన్ని తమ బ్యానర్లో రూపొందిస్తున్నామని, అందుకు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు రాధాకృష్ణ. 2017 సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని, హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక బృందాన్ని త్వరలో వెల్లడిస్తామని చెప్పాడు. కాగా, ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తుండగా, కాటమరాయుడు తర్వాత పవన్‌ను డైరెక్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు త్రివిక్రమ్.
ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత ఈ ఇద్దరూ కలిసి పనిచేయడం అభిమానులకు పండగే అని చెప్పాలి.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







