రష్యా మాల్‌వేర్‌ అమెరికా కంప్యూటర్‌లో..

- January 01, 2017 , by Maagulf
రష్యా మాల్‌వేర్‌ అమెరికా కంప్యూటర్‌లో..

అమెరికాలోని ఓ ప్రభుత్వ కంప్యూటర్‌లో ప్రమాదకరమైన రష్యన్‌ మాల్‌వేర్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా హ్యాకర్ల ప్రభావం ఉందన్న అనుమానాలు వెలువడ్డాయి. రాజకీయ పార్టీల వెబ్‌సైట్లు.. ఈ-మెయిల్స్‌ హ్యాకింగ్‌లో రష్యా హస్తముందన్న ఆరోపణలు వినిపించాయి. దానిపై అమెరికా అధ్యక్షుడు ఒబామా దర్యాప్తునకు కూడా ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన సైబర్‌ నిపుణులు.. తాజాగా బర్లింగ్టన్‌ విద్యుత్‌ శాఖకు చెందిన ఓ ల్యాప్‌టాప్‌లో ప్రమాదకరమైన మాల్‌వేర్‌ అప్లికేషన్‌ ఉన్నట్లు పసిగట్టారు. .
ఎన్నికల సమయంలో డెమోక్రటిక్‌ నేషనల్‌ కమిటీకి చెందిన కంప్యూటర్లలోనూ ఇలాంటి మాల్‌వేర్‌నే గుర్తించినట్లు సెక్యూరిటీ అధికారులు తెలిపారు.

ఐపీ అడ్రస్‌ ఆధారంగా రెండు కంప్యూటర్లకు మాల్‌వేర్‌ను పంపింది ఒకే హ్యాకర్‌ గ్రూప్‌ అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com