ఖైదీ వేదిక మారిందా..?
- January 01, 2017
మెగా అభిమానులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్న చిరంజీవి రీ ఎంట్రీ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జనవరి 11న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. మెగా సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లేకుండానే ఆడియోను మార్కెట్ లోకి వదిలేస్తున్నారు. అయితే అభిమానుల కోసం ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.
ఈ వేడుక జనవరి 4న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీడియో మేసేజ్ ద్వారా స్వయంగా ప్రకటించాడు. అయితే ఇప్పుడు మెగా అభిమానులకు షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందుగా అనుకున్నట్టుగా జనవరి 4న కాకుండా జనవరి 7న నిర్వహించాలని భావిస్తున్నారట. అంతేకాదు వేదిక విషయంలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. విజయవాడలో కాకుండా గుంటూరులో ఫంక్షన్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోన్ విషయంలో మెగా టీం ఎలాంటి ప్రకటన చేయకపోయినా వాయిదా వేయటం కన్ఫామ్ అన్నటాక్ వినిపిస్తోంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







