బాలీవుడ్ లో రానున్న బంపర్ కాంబో

- January 01, 2017 , by Maagulf
బాలీవుడ్ లో రానున్న బంపర్ కాంబో

"అ" అంటే అమితాబ్‌బచ్చన్, "ఆ" ఆమీర్‌ఖాన్ ప్రధాన పాత్రల్లో "థగ్స్ ఆఫ్ హిందుస్థాన్" పేరుతో ఓ భారీ చిత్రం రూపొంద నున్న విషయం తెలిసిందే. తమ అసాధారణ నటనతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేకస్థానం ఏర్పరుచుకున్నారు. అమితాబ్‌బచ్చన్, ఆమీర్‌ఖాన్ కలయికలో వస్తోన్న తొలిచిత్ర మిదే కావడం విశేషం.ఇందులో వీరిద్దరి పాత్రలు వినూత్నంగా ఉంటాయని తెలిసింది. యశ్‌రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా '1. నేనొక్కడినే', 'దోచేయ్‌' సినిమాల ఫేమ్‌ కృతీ సనన్‌ నటించనున్నారని బాలీవుడ్‌టాక్‌. ఆమిర్‌ఖాన్‌కు జోడీగా కృతిసనన్‌ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం.
ఆమె పేరును ఆమీర్‌ఖాన్ చిత్రవర్గాలకు సూచించినట్లు తెలిసింది. జయాపజయాలకు అతీతంగా చక్కటి అవకాశాల్ని సొంతం చేసుకుంటోంది కృతిసనన్. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన ఈ సొగసరి ఆపై బాలీవుడ్ బాట పట్టింది. హీరోపంటి, దిల్‌వాలే సినిమాలతో హిందీ చిత్రసీమలో ప్రతిభను చాటుకుంది. 
చిత్ర పరిశ్రమలో స్నేహితుల దగ్గర కృతి నటన గురించి ఆమిర్‌ చెబుతున్నారట. ప్రామిసింగ్‌ యంగ్‌స్టర్స్‌లో కృతి ఒకరని అన్నారట. ఓ వైపు అమితాబ్‌ బచ్చన్‌... మరోవైపు ఆమిర్‌ఖాన్‌... ఇద్దరు సూపర్‌స్టార్‌లు కలసి నటిస్తున్న తొలి సినిమాలో తనకు అవకాశం రావడం పట్ల హీరోయిన్‌ కృతీ సనన్‌ సంతోషంగా ఉన్నారని ముంబయ్‌ వర్గాల సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌' చిత్ర షూటింగ్‌ ప్రారంభించి, ఆ తరువాత ఏడాది 2018 దీపావళికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. స్వాతంత్రానికి పూర్వం భారత సరిహద్దులలో హూణులు ధగ్గులు అనబడే దారిదోపిడీ గాళ్ళ ప్రభావం ఉండేది. వారి కథాంశమే ఈ సినిమాకు మూలం అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com