మళ్ళీ లొల్లి మొదలెట్టిన ములాయం
- January 01, 2017
ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం సమసిపోయిందని భావిస్తున్న తరుణంలో ఆదివారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈ రోజు పార్టీ కార్యవర్గ జాతీయ సదస్సు నిర్వహించిన పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ ను పార్టీ నుంచి మళ్లీ బహిష్కరించారు. అఖిలేష్ కు మద్దతు తెలిపిన పార్టీ సీనియర్ నేతలు నరేష్ అగర్వాల్, కిరణ్మయి నందాలపై కూడా వేటు వేశారు. ఈ నెల 5న జాతీయ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్టు ములాయం ప్రకటించారు.
యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్-రాంగోపాల్ యాదవ్, ములాయం-సోదరుడు శివపాల్ యాదవ్ గ్రూపులు పోటాపోటీగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తుండటంతో ఎస్పీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు కూడా గ్రూపులు వారీగా విడిపోయారు. అఖిలేష్ గ్రూపు ఈ రోజు జాతీయ స్థాయ సమావేశం నిర్వహించి ఆయన్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. యూపీ ఎస్పీ అధ్యక్షుడిగా ఉన్న శివ్‌పాల్ యాదవ్‌ను పదవి నుంచి తొలగించి, ములాయంకు సన్నిహితుడైన అమర్‌సింగ్‌పై వేటు వేశారు. ఈ నేపథ్యంలో సోదరుడు రాంగోపాల్ పై వేటు వేసిన ములాయం.. కొడుకు అఖిలేష్ పై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. జాతీయ స్థాయి సమావేశానికి ములాయం పిలుపునివ్వడంతో ఎస్పీలో ఆధిపత్య పోరు తీవ్రమైంది.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







