తండ్రి కాబోతున్న సల్మాన్ ఖాన్
- January 01, 2017
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏ పాత్రలో నటించినా ప్రేక్షకుల మెప్పు పొందుతూ ఉంటాడు. 'దంగల్'లో అమీర్ ఖాన్ 'హానికారక్ బాపూ'గా నటించి ప్రశంసలు పొందుతున్నాడు. సల్మాన్ ఖాన్‌కు ఇదే స్ఫూర్తినిచ్చినట్లుంది. తన తదుపరి చిత్రంలో 13 ఏళ్ళ బాలికకు తండ్రిగా నటించబోతున్నాడని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఓ ప్రముఖ దినపత్రిక సల్మాన్‌ను ఈ విషయంపై ప్రశ్నించినపుడు ''నేను ముప్ఫయ్యేళ్ళ వయసున్నపుడే 'జబ్ ప్యార్ కిసీసే హోతా హై'లో తండ్రి పాత్ర పోషించాను. నా తర్వాతి చిత్రంలో 13 ఏళ్ళ అమ్మాయికి తండ్రిగా నటించబోతున్నాను. ఇది నాట్యం నేపథ్యంలో సాగే చిత్రం. నేను సుశిక్షితుడినైన నృత్యకారుడిని కాబోతున్నాను. ఇది ఎంత శ్రమతో కూడుకున్నదో తెలుసా? సుల్తాన్ కూడా శ్రమతో కూడుకున్నదే. నేను 18 కేజీల బరువు కోల్పోయాను.
ఇంట్లో తిండే తిన్నాను. నేను రుచి కోసం తినను. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు తగినన్ని రాగానే భోజనం టేబుల్ దగ్గర నుంచి లేచిపోయేవాడిని. 18 కిలోల బరువు కోల్పోవడం ఈ భూమిమీద చాలా కష్టంతో కూడుకున్నది.
సునాయాసమైన కఠోర శ్రమను తెరపై చూపించడాన్నే నేను నమ్ముతాను. క్యారెక్టర్ రోల్స్‌లో నన్ను నేను చూసుకోలేను. నేను 51 ఏళ్ళవాడినైతేనేం? స్టాలోన్ ఇప్పటికీ అద్భుతంగా ఉన్నాడు, రాంబో 70 ఏళ్ళ వయసులో చేస్తున్నాడు.
చిత్ర నిర్మాణం చాలా గొప్పది. కలలను అమ్ముతారిక్కడ. నేను నాలాగా ఎందుకు ఉండకూడదు?'' అన్నాడు.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







