ఇస్తాంబుల్‌లోని న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం

- January 01, 2017 , by Maagulf
ఇస్తాంబుల్‌లోని న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం

టర్కీలోని ప్రధాన నగరమైన ఇస్తాంబుల్‌లో ఉగ్రవాది నరమేధం సృష్టించాడు. ఓ నైట్‌క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ప్రజలపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో 35 మంది ప్రాణాలు కోల్పోగా.. 40 మందికి పైగా గాయపడ్డారు. శాంతాక్లాజ్‌ దుస్తుల్లో వచ్చిన దుండగుడు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దాడి సమయంలో నైట్‌క్లబ్‌లో సుమారు 500 మంది ఉన్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com