మళ్ళీ లొల్లి మొదలెట్టిన ములాయం

- January 01, 2017 , by Maagulf
మళ్ళీ లొల్లి మొదలెట్టిన ములాయం

ఉత్తరప్రదేశ్‌ లో అధికార సమాజ్‌ వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం సమసిపోయిందని భావిస్తున్న తరుణంలో ఆదివారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎస్పీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈ రోజు పార్టీ కార్యవర్గ జాతీయ సదస్సు నిర్వహించిన పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌ యాదవ్‌ ను పార్టీ నుంచి మళ్లీ బహిష్కరించారు. అఖిలేష్‌ కు మద్దతు తెలిపిన పార్టీ సీనియర్‌ నేతలు నరేష్‌ అగర్వాల్‌, కిరణ్మయి నందాలపై కూడా వేటు వేశారు. ఈ నెల 5న జాతీయ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్టు ములాయం ప్రకటించారు.

యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌-రాంగోపాల్‌ యాదవ్‌, ములాయం-సోదరుడు శివపాల్‌ యాదవ్‌ గ్రూపులు పోటాపోటీగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తుండటంతో ఎస్పీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు కూడా గ్రూపులు వారీగా విడిపోయారు. అఖిలేష్ గ్రూపు ఈ రోజు జాతీయ స్థాయ సమావేశం నిర్వహించి ఆయన్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. యూపీ ఎస్పీ అధ్యక్షుడిగా ఉన్న శివ్‌పాల్‌ యాదవ్‌ను పదవి నుంచి తొలగించి, ములాయంకు సన్నిహితుడైన అమర్‌సింగ్‌పై వేటు వేశారు. ఈ నేపథ్యంలో సోదరుడు రాంగోపాల్‌ పై వేటు వేసిన ములాయం.. కొడుకు అఖిలేష్ పై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. జాతీయ స్థాయి సమావేశానికి ములాయం పిలుపునివ్వడంతో ఎస్పీలో ఆధిపత్య పోరు తీవ్రమైంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com