పెరిగిన గ్యాస్, విమాన ఇంధన ధరలు
- January 01, 2017
ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఫ్) ధరను ఇంధన సంస్థలు 8.6శాతం పెంచాయి. దీంతో పాటు ఎల్‌పీజీ ధరను కూడా సిలిండర్ ధర కూడా రూ.2 పెంచాయి. దీంతో ఏడు నెలల్లో ఎనిమిదిసార్లు గ్యాస్ ధర పెరిగినట్లైంది. దీంతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.434.71కి చేరుకుంది. గత జూన్‌లో గ్యాస్‌పై సబ్సిడినీ తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో స్వల్పంగా ధరలు పెంచుతూ వస్తున్నారు. ప్రతీ నెల మొదటి తేదీన ఏటీఎఫ్ గ్యాస్ సబ్సిడీని ఫారెన్ ఎక్స్ఛేంజీ రేటు ఆధారంగా ఆయిల్ కంపెనీలు పెంచాతాయి.
ప్రభుత్వం గ్యాస్, కిరోసిన్‌పై సబ్సిడీలను తొలగించేందుకు డీజిల్ విధానాలనే అనుసరించాలని నిర్ణయించడంలో భాగంగా ప్రస్తుతం రేటు పెంచారు. కిరోసిన్ ధరలను కూడా ఏటా 0.25 పైసలు పెంచాలని నిర్ణయించడంతో ప్రస్తుతం పదోసారి ధర పెంచాల్సి పెంచుతున్నారు. ప్రస్తుతం ముంబయిలో కిరోసిన్ రూ.18.28కి విక్రయిస్తున్నారు. ఇక దిల్లీని ఇప్పటికే కిరోసిన్ రహిత రాష్ట్రంగా ప్రకటించారు. దీంతో అక్కడ పీడీఎస్ డిపార్ట్‌మెంట్ సబ్సిడి కిరోసిన్‌ను విక్రయించదు.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







