టర్కీ లోని దాడిలో మృతిచెందిన ఇద్దరు భారతీయులు
- January 01, 2017
ఇస్తాంబుల్ ఉగ్రదాడిలో ఇద్దరు భారతీయులు మృతి చెందినట్లు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మృతులు అబిస్ రిజ్వీ, గుజరాత్‌కు చెందిన ఖుషీ షాగా గుర్తించినట్లు చెప్పారు. అబిస్ రిజ్వీ రాజ్యసభ మాజీ సభ్యుడి కుమారుడిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. టర్కీలోని భారత రాయబారి ఇస్తాంబుల్ బయలుదేరినట్లు తెలిపారు.
టర్కీలోని ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లో ఉగ్రవాది నరమేధం సృష్టించాడు. ఓ నైట్ క్లబ్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటున్న ప్రజలపై దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో 35 మంది ప్రాణాలు కోల్పోగా 40మందికి పైగా గాయపడ్డారు. శాంతాక్లాజ్ దుస్తుల్లో వచ్చిన దుండగుడు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో నైట్ క్లబ్లో సుమారు 500 మంది ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







