బ్రిటన్‌పై రసాయన దాడికి కుట్ర

- January 01, 2017 , by Maagulf
బ్రిటన్‌పై రసాయన దాడికి కుట్ర

ఐఎస్‌ ఉగ్రవాదులు బ్రిటన్‌పై రసాయన దాడి జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని బ్రిటన్‌ రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌ తెలిపారు. ఆదివారం ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. ముఖ్యంగా ఇరాక్‌లో మొసూల్‌లో జరిగిన యుద్ధంలో పాల్గొన్న బ్రిటన్‌ సైనికులుతిరిగి స్వదేశానికి వస్తుండటంతో ఈ ఉగ్రముప్పు పెరుగుతోంది. భారీ సంఖ్యలో పౌరులను హత్య చేయడమే లక్ష్యంగా ఈ దాడి జరగవచ్చని ఆయన చెప్పారు. వారికి ఏమాత్రం అవకాశం ఉన్నా రసాయన ఆయుధాలు వినియోగిస్తారని పేర్కొన్నారు. ఈ విషయంలో వారికి ఎటువంటి అడ్డంకులు ఉండవని పేర్కొన్నారు. వారు ఎటువంటి రసాయనాలు వాడుతారో స్పష్టంగా తెలియకపోయినా భద్రతా దళాలు మాత్రం అప్రమత్తంగా ఉన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com