రంజిత్‌ నిర్మాతగా నీలం ప్రొడక్షన్స్‌..

- January 01, 2017 , by Maagulf
రంజిత్‌ నిర్మాతగా  నీలం ప్రొడక్షన్స్‌..

 'అట్టకత్తి' చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి దర్శకుడిగా అడుగుపెట్టారు రంజిత్‌. ఆ తర్వాత కార్తి హీరోగా 'మెడ్రాస్‌' చిత్రాన్ని రూపొందించి మరో హిట్‌ సొంతం చేసుకున్నారు. తన మూడో సినిమానే ఏకంగా రజనీకాంత్‌తో తెరకెక్కించే స్థాయికి చేరుకున్నారు. సూపర్‌స్టార్‌తో 'కబాలి' చిత్రాన్ని తెరకెక్కించి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఇదిలా ఉండగా తదుపరి కూడా రజనీకాంత్‌తోనే ఆయన ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా నూతన సంవత్సరంలో ఆయన నిర్మాతగా కూడా అడుగుపెట్టారు. తాను నిర్మాత మారుతున్న విషయాన్ని ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా శనివారం అర్ధరాత్రి 12 గంటలకు ప్రకటించారు. నీలం ప్రొడక్షన్స్‌ అనే సంస్థను ఆయన స్థాపించి 'పరియేరుం పెరుమాళ్‌' పేరిట తొలి చిత్రాన్ని రూపొందించనున్నారు.

ఈ చిత్రం ద్వారా మారి సెల్వరాజ్‌ దర్శకుడిగా అడుగుపెడుతున్నారు. దర్శకుడు రామ్‌ వద్ద 'కట్రదు తమిళ్‌', 'తరమణి' వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు సెల్వరాజ్‌. తిరునెల్వేలి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడి జీవితంలో చోటుచేసుకున్న ఆసక్తికరమైన విషయాలతో ఈ సినిమాను రూపొందించారు. ప్రేమ, యాక్షన్‌ వర్గాలను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.

'కిరుమి' ఫేమ్‌ కదిర్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆనంది కథానాయిక. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ నెలాఖరులో చిత్రీకరణ ప్రారంభం కానుంది.

అయితే చిత్రీకరణకు సంబంధించి పనులు అప్పుడే మొదలయ్యాయి. దర్శకుడు, సహాయ దర్శకుల బృందం నెల్లెలో మకాంవేసి చిత్రీకరణకు సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com