అల్‌ ఖోర్‌లో క్వాలిటీ మాల్‌ ప్రారంభం

- January 02, 2017 , by Maagulf
అల్‌ ఖోర్‌లో క్వాలిటీ మాల్‌ ప్రారంభం

అల్‌ కోర్‌లో క్వాలిటీ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ స్థాపించిన క్వాలిటీ మాల్‌ ప్రారంభమైంది. పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఇండియన్‌ రాయబారి కుమరన్‌, కెన్యా రాయబారి గల్మా ముఖె బోరు, పలువురు ఖతారీ ప్రముఖులు అబ్దుల్లా బిన్‌ జస్సిమ్‌ అల్‌ థని, షేక్‌ జస్సిమ్‌ తమిర్‌ అల్‌ థని, మొహమ్మద్‌ అల్‌ బఖ్రి, అబ్దుల్లా అల్‌ అమోది, ఇబ్రహీమ్‌ అల్‌ మల్కి, దోహా బ్యాంక్‌ గ్రూప్‌ సిఇఓ ఆర్‌.సీతారామన్‌ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రిబ్బన్‌ కటింగ్‌లో వీరంతా క్వాలిటీ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ ఛైర్మన్‌ షంషుద్దీన్‌ ఒలాకారాతో కలిసి బాగంపంచుకున్నారు. ఈ ఏడాది తమ సంస్థ నుంచి పలు మేజర్‌ ప్రాజెక్తులు ప్రారంభం కానున్నాయని ఒలాకారా చెప్పారు. కొత్తగా ప్రారంభమైన మాల్‌లో ఫ్రాంఛైజీస్‌, ఔట్‌లెట్స్‌, ఇండిపెండెంట్‌ కియోస్క్స్‌, ఫ్యాషన్‌ యాక్సెరీస్‌, హోమ్‌ అప్లయన్సెస్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంకా అనేక రకాలైనవి వినియోగదారుల్ని ఆకట్టుకోనున్నాయి. మనీ ఎక్స్‌ఛేంజ్‌, బ్యూటీ సెలూన్‌, కాన్ఫెక్షనరీ, లాండ్రీ, ఫార్మసీ, ఫుడ్‌ కోర్ట్‌, వంటివీ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇందులో సెకెండ్‌ ఫేజ్‌ ఎక్స్‌పాన్షన్‌ కూడా నిర్మాణంలో ఉంది. బౌలింగ్‌ సెంటర్‌, వర్చువల్‌ క్రికెట్‌, ఫుట్‌బాల్‌ సెంటర్‌, గేమింగ్‌ జోన్‌ వంటివాటితో ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఖతార్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ డే సందర్భంగా దీన్ని ప్రారంభిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com