ఎన్.ఆర్.ఐ లకు బంపర్ ఆఫర్
- January 02, 2017
పెద్ద నోట్లను ఈ ఏడాది జూన్ వరకు మార్చుకోవచ్చని ఎన్ ఆర్ ఐ లకు కేంద్రం ఆఫర్ ఇచ్చింది. అయితే ఆర్థికశాఖ కొత్త మెలిక పెట్టింది.డిపాజిట్ కంటే ముందు కస్టమ్స్ అధికారుల నుండి ధృవీకరణ పత్రాలను తీసుకురావాలని ఆర్థికశాఖ తేల్చింది.
ఎన్ ఆర్ ఐ లు ఈ ఏడాది జూన్ వరకు పాత నగదును మార్పిడి చేసుకోవచ్చని కేంద్రం వెసులుబాటు కల్పించింది.అయితే నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసేముందు కస్టమ్స్ అధికారుల నుండి ధృవీకరణ పత్రాలను పొందాలన్నారు.
కస్టమ్స్ అధికారులకు ఇచ్చిన ధృవీకరణ పత్రాల్లో ఎంత డబ్బైతే పేర్కొన్నారో అంతే ఆర్భిఐ శాఖల్లో జమ చేయాలని కోరారు. ప్రస్తుతం ఎన్ ఆర్ ఐలకు,విదేశాల్లో ఉంటున్న భారతీయులకు ప్రస్తుతం విదేశాలకు వెళ్తున్న వారికి స్పష్టమైన వివరణలో ఇస్తే ఇక్కడే ఉంటున్నవారికి మాత్రమే పాతనోట్లను జమచేసేందుకు అవకాశం ఇస్తున్నారు.విదేశాలకు వెళ్ళే భారతీయులకు అయితే మార్చి 31 వరకు ఎన్ ఆర్ ఐ లకు జూన్ 30వరకు ఆర్ బి ఐ శాఖల్లో డబ్బును డిపాజిట్ ను చేసే అవకాశం ఉంది. విదేశాల నుండి తమ పాత నగదును డిపాజిట్ చేసేందుకు భారత్ కు వచ్చే వారు ఆయా విమానాశ్రయాల్లోనే తొలతు తాము డిపాజిట్ చేసే పాత డబ్బును చూపించాల్సి ఉంటుంది.
అర్హులైన భారత పౌరులు ఎంత డబ్బును మార్చుకోవాలనే దానిపై పరిమితి లేదు. ఎన్ ఆర్ ఐలు మాత్రం ఫెమా చట్ట నిబంధనల కింద 25 వేల రూపాయాలను జమ చేసుకొనే అవకాశం ఉంది.
తాము డిపాజిట్ చేసే పాత నోట్లను ముందే ఎయిర్ పోర్ట్ వద్ద కస్టమ్స్ అధికారులకు చూపించి వారి నుండి అనుమతి పత్రాలను తీసుకోవాలి. వారు డబ్బును డిపాజిట్ చేసే ఆర్ బి ఐ శాఖల్లో ఈ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సమయంలో తాము విదేశాల్లో ఉన్నామని, ఇదివరకు నోట్లు మార్చుకోలేదని గుర్తింపు పత్రాలు చూపించిన వారికి మాత్రమే ఈ నగదును డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







