పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వం నజరానా
- January 02, 2017
రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు గతంలో ప్రకటించినట్టుగా తెలంగాణ ప్రభుత్వం నజరానా అందజేసింది. నగరంలోని షేక్ పేట్లో ఆమెకు వెయ్యి గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
గతేడాది జరిగిన ఒలింపిక్స్ లో తెలుగమ్మాయి పీవీ సింధు రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిరస్మరణీయ విజయం తర్వాత సింధుకు 5 కోట్ల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అలాగే హైదరాబాద్లో ఆమెకు వెయ్యి గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని.. ఆమె చేస్తానంటే తగిన ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.
రియో నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చిన వెంటనే సింధును కేసీఆర్ సన్మానించి చెక్ అందజేశారు. ఇప్పుడు ఇంటి స్థలాన్ని కేటాయించారు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







