బ్యాంకాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం...25 మంది మృతి
- January 02, 2017
కొత్త సంవత్సరం రెండో రోజే థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మినీ వ్యాన్ అదుపు తప్పి ట్రక్కును ఢీకొన్న దుర్ఘటనలో 25 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. మినీ వ్యాన్‌లో 13 మంది, పికప్ ట్రక్కులో కిక్కిరిసి 12 మంది ఉన్నారు. మినీ వ్యాన్ డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ట్రక్కులో దూసుకుపోయింది. రెండు వాహనాల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు కొందరు సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ దారుణ ఘటన థాయల్యాండ్‌లో ప్రమాదకర పరిస్థితులపై మరో హెచ్చరికలాంటిదని నిపుణులు అంటున్నారు.
గత ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం థాయ్‌లో ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నవారి సంఖ్య చూస్తే.. ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. కొత్త సంత్సరం ప్రారంభంలోనూ, ఏప్రిల్‌లో వచ్చే మతపరమైన పండుగ సమయంలోనూ రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ రెండు వారాలను 'మోస్ట్ డెడ్లీ వీక్స్'గా వ్యవహరిస్తుంటారు.
నగరాల నుంచి లక్షల సంఖ్యలో శ్రమజీవులు స్వగ్రామాలకు వెళ్లి వచ్చే రోజులివి. కొత్త ఏడాది సందర్భంగా ఇచ్చిన సెలవుల్లో నాలుగో రోజు అంటే ఆదివారం నాటికి థాయ్‌ల్యాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 280 మరణించారు. ఈ సంఖ్య గత ఏడాది కంటే పది శాతం ఎక్కువ.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







