బచ్చలికూర సూప్
- January 04, 2017
కావలసినవి: నాలుగు వందల గ్రాములు తరిగిన బచ్చలికూర, ఒక తరిగిన ఉల్లిపాయ, రెండు వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క ఒకటి, తరిగిన పచ్చి మిరపకాయలు రెండు, బిరియానీ ఆకులు రెండు, కొన్ని మిరియాలు, రెండు టీస్పూన్ల చొప్పున నూనె, మీగడ, ఉడికించి తరిగిన చిన్న బంగాళాదుంప, తగినంత ఉప్పు.
తయారీ విధానం:
మొదట బచ్చలికూరను శుభ్రంగా కడిగి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. ఒక గిన్నెలో నూనె పోసి వెల్లుల్లి రెబ్బలు, బిరియానీ ఆకులు, దాల్చిన చెక్క, మిరియాలు, పచ్చి మిరపకాయ ముక్కలు, బచ్చలికూర వేసి బాగా కలపాలి. బంగాళాదుంప ముక్కలు, కొన్ని నీళ్లు పోసి వేడిచేయాలి. బిరియానీ ఆకులు తీసేసి ఆ గుజ్జులాంటి మిశ్రమంలో కొద్దిగా నీరు, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. కొద్దిసేపటి తరువాత మీగడ వేసి మళ్లీ కొద్దిసేపు ఉడకనిచ్చి సర్వ్ చేస్తే సూపర్బ్‌గా ఉంటుంది.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









