విక్రమ్‌ సినిమా తన శరీరం నుంచి చాలా డిమాండ్‌ చేస్తోంది..అఖిల్‌

- January 07, 2017 , by Maagulf
విక్రమ్‌ సినిమా తన శరీరం నుంచి చాలా డిమాండ్‌ చేస్తోంది..అఖిల్‌

విక్రమ్‌ సినిమా తన నుంచి చాలా డిమాండ్‌ చేస్తోందని హీరో అక్కినేని అఖిల్‌ అన్నారు. 'అఖిల్‌' తర్వాత ఆయన కథానాయకుడిగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని తన పాత్ర కోసం కసరత్తులు ప్రారంభించినట్లు అఖిల్‌ ట్వీట్‌ చేశారు. నేటి నుంచి కొత్త వ్యాయామ షెడ్యూల్‌, డైట్‌ ఫాలోఅవుతున్నట్లు పేర్కొన్నారు. తర్వాతి సినిమా కోసం ఫిట్‌ అవ్వాల్సిన సమయమని పేర్కొన్నారు. విక్రమ్‌ సినిమా తన శరీరం నుంచి చాలా డిమాండ్‌ చేస్తోంది.. చాలా ఉత్సుకతగా ఉందని ట్వీట్‌ చేశారు. .
ఈ చిత్రంలో తమిళ నటి మేఘ ఆకాష్‌ను కథానాయికగా అనుకుంటున్నట్లు సమాచారం.

విక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన '24' చిత్రం ఇటీవల విడుదలైంది. సూర్య, సమంత, నిత్యామేనన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com