పాత ఏడాదికి - కొత్త ఏడాదికి మధ్య బెంగళూరులో జరిగిన ఘోరాలు..
- January 07, 2017
పాత ఏడాదికి - కొత్త ఏడాదికి మధ్య బెంగళూరులో జరిగిన ఘోరాలు రోజుకొకటి వెలుగుచూస్తూనే ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఓ వైపు నిందితుల అరెస్టులు జరుగుతుంటే.. మరోవైపు ఈ ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. గ్రీన్ సిటీ, క్లీన్ సిటీ బెంగళూరుకు కేవలం ఒకే ఒక రాత్రి జరిగిన ఘోరాలు అగ్లీ సిటీ మచ్చ తెచ్చాయి. అర్థరాత్రి మహిళలు రోడ్డుపైకి వెళ్లాలంటేనే వణికిపోయేలా చేస్తున్నాయి. డిసెంబర్ 31న ఎందరో యువతులు లైంగిక వేధింపులకు గురికాగా.. అంతకు ముందు రోజు శుక్రవారం అర్థరాత్రి నగర్వారా మెయిన్ రోడ్డులో జరిగిన మరో దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. తెల్లవారుజామున ఆఫీసుకు వెళ్లేందుకు ఇంటినుంచి బయలుదేరిన 23 ఏళ్ల యువతిని దారిలో ఒకడు వేధించాడు. మెయిన్రోడ్పై బస్టాప్ దగ్గర్లోనే ఈ ఘోరం జరిగింది. ఆ యువతి కీచకుడి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా పెనుగులాడింది. స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. చివరికి తప్పించుకున్న ఆమె KG హళ్లీ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. యువతి కంప్లైంట్తో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ దారిలోని CCటీవీ ఫుటేజ్ల్ని పరిశీలించారు. ఓ ఇంటి దగ్గరున్న కెమెరాలో అగంతకుడు యువతిని వెంబడిస్తున్న దృశ్యాలు కనిపించాయి. దాడి మాత్రం రికార్డు కాలేదు. అలాగే.. ఆ అమ్మాయిపై దాడి చేశాక తిరిగి అతను అదే దారిలో వెనక్కు వచ్చిన దృశ్యాలు కూడా రికార్డయ్యాయి. ఈ ఆధారాలతో అతడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఇటు డిసెంబర్ 31 రాత్రి నగరంలోని ఎంజీ రోడ్, బ్రిగేడియర్ రోడ్లలో మహిళలపై జరిగిన లైంగిక వేధింపులపై బెంగళూరు పోలీసులు నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ రోజు అదే ప్రాంతంలో 1400 మంది పోలీసులు, 40 సీసీటీవీలతోపాటూ మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారని.. పోలీసు అధికారులు తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదన్నారు. మీడియాలో వచ్చిన వార్తలు, కథనాల ఆధారంగా పోలీసులు మూడు కేసులు, సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా మరో కేస్ నమోదు చేశారు. కమ్మనహళ్లి లైంగిక వేధింపుల కేసులో ఆరుగురిని గుర్తించిన పోలీసుల వారిలో నలుగురిని అరెస్ట్ చేశారు. విచారణలో లిప్ లాక్, హగ్ కోసమే యువతిపై దాడి చేశానని నిందితుడు లెనిన్ అంగీకరించాడు. వీరిని సీపీ ఆఫీసుకు తీసుకెళ్లిన పోలీసులు తప్పించుకున్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









