మామగారి సినిమాలో సమంత.....
- January 07, 2017
ప్రస్తుతం ఓం నమో వేంకటేశాయ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్ హీరో నాగార్జున తన నెక్ట్స్ సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. టీవీ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత డైరెక్టర్ గా సక్సెస్ సాధించిన ఓంకార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఓంకార్ దర్శకత్వంలోనే తెరకెక్కిన రాజుగారి గది సినిమాకు సీక్వల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
నాగ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు సందడి చేయనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా రన్ రాజా రన్ ఫేం సీరత్ కపూర్ ను ఎంపిక చేయగా మరో కీలక పాత్రకు స్టార్ హీరోయిన్ సమంతను ఫిక్స్ చేశారు.
మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. గతంలో నాగార్జున, సమంతలు మనం సినిమాలో కలిసి నటించారు. రాజుగారి గది 2లో కూడా నాగ్, సమంత పాత్రలు మనం తరహాలోనే ఉండే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









