నేపాల్‌కు రూ.100 కోట్లు..

- January 07, 2017 , by Maagulf
నేపాల్‌కు రూ.100 కోట్లు..

ఆర్‌బీఐ నేపాల్‌కు రూ.100 కోట్ల విలువైన భారతీయ కరెన్సీని అందించనుంది. నేపాల్‌లో భారతీయ రూ.100 నోట్లకు కొరత ఏర్పడటంతో ఈ చర్యలు తీసుకుంటోంది. నేపాల్‌ రాష్ట్రబ్యాంక్‌ (ఎన్‌ఆర్‌బీ) అభ్యర్థన మేరకు ఆర్‌బీఐ స్పందించింది. భారత్‌లో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయడంతో నేపాల్‌లో కూడా నగదు కొరత ఏర్పడింది. అక్కడ పరిస్థితిని గమనించిన ఆర్‌బీఐ తొలుత కొన్నాళ్లు ఆగాల్సిందిగా నేపాల్‌ రాష్ట్రబ్యాంక్‌కు తెలియజేసింది.

ఆ దేశంలో భారతీయ నోట్లకు ఎక్స్‌చేంజి రేటును కూడా బాగా తగ్గించింది. సిటిజన్‌షిప్‌ ఆధారంగా రూ.2,000 వరకు అందజేస్తోంది. ఆర్‌బీఐ నుంచి నిధులు వచ్చేదాకా ఎక్స్‌చేంజి రేటులో మార్పు ఉండదని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com