మరోసారి ఖాకీ డ్రెస్ వేయబోతున్నాడు మాస్ రాజా...

- January 07, 2017 , by Maagulf
మరోసారి ఖాకీ డ్రెస్ వేయబోతున్నాడు మాస్ రాజా...

మాస్ మహారాజ్ రవితేజ ఖాకీ డ్రెస్ వేస్తే ఎలా ఉంటుందో మనం విక్రమార్కుడు , పవర్ చిత్రాలలో చూసాం..రవితేజ కు మాస్ ఇమేజ్ తీసుకొచ్చింది కూడా ఖాకీ డ్రెస్ అని చెప్పాలి..బెంగాల్ టైగర్ చిత్రం తర్వాత చాల గ్యాప్ తీసుకున్న రవితేజ , ప్రస్తుతం విదేశీ యాత్ర పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం.
బాబీ , దిల్ రాజు వంటి వారితో సినిమాలు చేస్తాడని ప్రచారం జరిగిన అవి సెట్స్ ఫైకి వెళ్ళలేదు..తాజాగా బలుపు హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఓ మూవీ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది.
తమిళం లో సూపర్ హిట్ అయినా సేతుపతి చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారట. ప్రస్తుతం గోపి , సాయి ధరమ్ తేజ్ తో విన్నర్ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు..ఇప్పటికే షూటింగ్ చివరికి చేరిందని తెలుస్తుంది. మహాశివరాత్రి కి ఈ మూవీ రిలీజ్ కాబోతుంది..ఇది రిలీజ్ అయినా వెంటనే రవితేజ తో మూవీ మొదలు పెట్టనున్నాడని వినికిడి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com