వినియోగదార్లను ఆకర్షించడానికి తంటాలు-భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్న కతార్ కారు డీలర్లు

- September 10, 2015 , by Maagulf
వినియోగదార్లను ఆకర్షించడానికి తంటాలు-భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్న కతార్ కారు డీలర్లు

పవిత్ర రమదాన్ మాసంలో తప్ప ఈ సమయంలో కొంత విచిత్ర మే ఐనప్పటికీ, గత కొద్ది నెలలుగా కతార్ లో యూస్డ్(వాడిన) కార్లను వాడేవారి సంఖ్య పెరుగుతూ ఉండడం, కొత్త కార్ల అమ్మకాలు కాస్త జోరు తగ్గి, ఇంచుమించు అందరు కారు డీలర్లు, డిస్ట్రబ్యూటర్లు తమ అమ్మకాలు పెంచుకోవడానికి కొత్త కస్టమర్లకు డిస్కౌంట్లు, భారీ క్యాంపేన్లు నిర్వహించడం తప్పడం లేదని ఒక డీలర్ వివరించారు. ఈయన సెడాన్, పిక్ అప్స్, మరియు కతారీయులకు అత్యంత ప్రియమైన వాహనం- ఎస్. యూ. వీ. లపై 15 నుండి 20 శాతం డిస్కౌంట్లు ప్రకటించారు. ఉచిత ఇన్సూరెన్స్ మరియు రిజిస్ట్రేషన్ తోపాటు ఎస్. యూ. వీ. ధర 2,20,000 కతార్ రియల్స్ నుండి 1,90,000  కతార్ రియల్స్ కు తగ్గించడం, 3 సంవత్సరాల పాటు ఉచిత సర్వీసు, ఉచిత విండొ టింటింగ్, సున్న నుంచి అతితక్కువ రేటులో డౌన్ పేమెంటు, కొన్ని యూనిట్లపై అతి తక్కువ రేట్లు వంటి ఆఫర్లతో ఆకట్టుకో ప్రయత్నిస్తున్నారు. ఇక కార్ల కంపెనీలు తమవంతుగా కొత్త కొత్త కార్లను పరిచయం చేస్తున్నారు. కానీ, ఈద్-అల్-అధా సెలవుదినాల సందర్భంగా ఈ మాసాంతంలో మరల కార్ల విక్రయాలు తగ్గే అవకాశముందని సేల్స్ రిప్రజెంటటివ్ లు వాపోతున్నారు.

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com