కొత్త బాధ్యతలు స్వీకరించిన జనరల్‌ రహీల్‌ షరీఫ్‌

- January 07, 2017 , by Maagulf
కొత్త బాధ్యతలు స్వీకరించిన జనరల్‌ రహీల్‌ షరీఫ్‌

పాకిస్థాన్‌ మాజీ సైన్యాధిపతి జనరల్‌ రహీల్‌ షరీఫ్‌ కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. సౌదీఅరేబియా నేతృత్వంలోని 39 దేశాల సంకీర్ణ దళాల కూటమికి ఆయన సారథ్యం వహించనున్నారు. భద్రతా సహకారం, ఉగ్రవాదంపై పోరుకు ఈ సేనను ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రభుత్వ అనుమతితోనే రహీల్‌కు సౌదీ ఈ బాధ్యతలు అప్పజెప్పుతోందని పాక్‌ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ అన్నారు. ఒప్పందం తాలూకు పూర్తి వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. సౌదీ అరేబియా ప్రకారం ఉగ్రమూకలు, ఐఎస్‌ఐఎస్‌పై పోరాడేందుకు ఈ సంకీర్ణ దళం ఏర్పాటు చేశారు. తొలుత 34 దేశాలు సభ్యులుగా ఉండేవి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com