రామ్ గోపాల్ వర్మ కు మెగా బ్రదర్ వార్నింగ్

- January 07, 2017 , by Maagulf
రామ్ గోపాల్ వర్మ కు మెగా బ్రదర్ వార్నింగ్

టైటిల్ లో తప్పులేదు. ఈ మేటర్ కి కరెక్ట్ టైటిల్ ఇది. రామ్ గోపాల్ వర్మ ఇలాంటి టైటిల్స్ వాడుతుంటాడు. అందుకే ఈ టైటిల్ వాడాం. రామ్ గోపాల్ వర్మ ను తమ కామెంట్స్ తో రేప్ చేసి పారేశారు మెగా బ్రదర్ నాగ బాబు. ఖైదీ నెంబర్ 150 ఈవెంట్ లో మాట్లాడిన నాగబాబు.. రామ్ గోపాల్ వర్మను ఒక పనికిమాలిన వేస్ట్ ఫెలో కింద లెక్క కడుతూ అక్కు పక్షితో పోల్చారు. ఒక వెదవ సుంట అని తిట్టిపోశారు. ఆ వెధవ అడ్డ దారిలో దర్శకుడు అయ్యాడు. అలాటి చెత్త నా.. మా అన్నయ్యని, మా సినిమాల్ని విమర్శిస్తున్నాడు. ఈ వెధవ సినిమాలు తీయడం మర్చిపోయాడు. పనికి మాలిన మాటలతో కాలం గడుపుతున్నాడు. ముందు ఆ వెధవ సినిమా తీయడం నేర్చుకోవాలి. అడ్డ దారిలో దర్శకుడు అయిన ఆ అక్కుపక్షి ట్విట్టర్, పేస్ బుక్ లో మా పై అరిస్తే..

మా వెంట్రుక కూడా తెగిపోదు. కష్టపడి పైకి వచ్చాం. వాడిలా అడ్డదారిలో రాలేదు. మెంటల్ వెధవ. మాపై వాగుతున్నాడు. మా సినిమాని తక్కువ చేసి మాట్లాడే హక్కు ఆ వెధవ కి ఎవరు ఇచ్చారు. ఇలాంటి పనికి మాలిన మాట్లాడి మా సినిమాని ఆ వెధవ తగ్గించలేడు. ఖబడ్డార్" అని కోపంతో ఊగిపోయారు నాగబాబు. వర్మ ఇటివల చిరంజీవి సినిమాపై తన ట్విట్టర్ నెగిటీవ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే కాదు పదే పదే మెగా ఫ్యామిలీని కార్నర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న వర్మకు ఇప్పుడు మెగా ఈవెంట్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు నాగబాబు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com