ఎయిర్ ఇండియా విమానాల్లో ప్లాస్టిక్ బేడీలు సిద్ధం

- January 07, 2017 , by Maagulf
ఎయిర్ ఇండియా విమానాల్లో ప్లాస్టిక్ బేడీలు సిద్ధం

కామాంధులు విమానాల్లో కూడా తమ దుర్బుద్ధిని ప్రదర్శిస్తుండటంతో ఎయిరిండియా కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసింది. రెండు వారాల్లోనే ఇద్దరు ప్రయాణికులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో అధికారులు గట్టి నిర్ణయాలను ప్రకటించారు. విమానానికిగానీ, ఇతర ప్రయాణికులకు కానీ ప్రమాదకరంగా పరిణమించే ప్రయాణికులను సీట్లకు కట్టేసేందుకు ప్లాస్టిక్ బేడీలను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు. ఎయిరిండియా చైర్మన్ అశ్వని లోహానీ మాట్లాడుతూ రెండు జతల ప్లాస్టిక్ బేడీలను అన్ని విమానాల్లోనూ సిద్ధంగా ఉంచుతామన్నారు. గతంలో కేవలం అంతర్జాతీయ విమానాల్లో మాత్రమే వీటిని ఉంచేవారమని, ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. విమానం, ప్రయాణికులు సురక్షితంగా ఉండటమే తమకు అత్యంత ప్రధాన విషయమని తెలిపారు. భద్రతకే తాము ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com