అత్యంత ప్రమాదకరమైన దేష్ తీవ్రవాదులను ' మట్టుపెట్టిన సౌదీ భద్రతాదళాలు
- January 08, 2017
జెడ్డా:అత్యంత ప్రమాదకరమైన ఇద్దరు 'దేష్ తీవ్రవాదులను ' సౌదీ భద్రతా దళాలు శనివారం మట్టుపెట్టారు రియాద్ రాజధాని ఉత్తర జిల్లాలో జరిగిన ఒక కాల్పుల అనంతరం వారు హతమయ్యారు. అల్ యస్సామీన్ జిల్లాలో ఒక మారుమూల ఉన్న ఒక బంగ్లాలో వారు హాజరయ్యారనే ఒక కీలక సమాచారం అందుకొన్న భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.తమకు లొంగిపోవాలని తీవ్రవాదులను కోరారు. అందుకు నిరాకరించిన కలష్నికోవ్ రైఫిళ్ల తో ఆ ఇరువురు తీవ్రవాదులు భద్రత దళాలపై కాల్పులు జరుపుతూ ,భద్రతా పాట్రోల్ కారులోనే తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ ప్రయత్నం లోనే వారు పెట్రోల్ కారు వెనుక నుండి చేరుకొంటున్న సమయంలో ఆ సమీపంలో ఉన్న ఒక పోలీసు అధికారి స్పందించి ఆ తీవ్రవాదులను తుపాకీతో కాల్చి హతమార్చారు. ఈ కాల్పులలో ఆ పోలీస్ అధికారి సైతం కొద్దిగా గాయపడ్డారు ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ అతి ముఖ్యమైన ఇరువురు తీవ్రవాదులు టు టాఇ సేలం బిన్ ఎస్లమ్ అల్ సయ్యారి అతని సహచరుడు తలాల్ బిన్ సమరం అల్ సెడి లు , తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో భద్రతా దళాలు జరిపిన కాల్పులలో చంపబడ్డారని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ భద్రతా ప్రతినిధి మేజర్. ఆది మన్సోర్ అల్ తుర్కీ " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు. ఈ ఇరువురు తీవ్రవాదుల వద్ద రెండు మెషిన్ గన్స్, రెండు పేలుడు బెల్ట్ మరియు ఒక చేతి గ్రెనేడ్ కలిగి ఉన్నారని వారు ఉంటున్న ఇంటిలో పేలుడు పదార్ధాల తయారీలో ఉపయోగించే రసాయనిక పదార్థాలు, పురుషుల బట్టలు, మహిళలు తొడుక్కొనే ఒక గౌను, కొన్ని ఆహార పదార్ధాలు మరియు మూడు గ్యాస్ సిలిండర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. పోలీస్ కాల్పులలో మరణించిన ఈ ఇరువురు అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులలో ముఖ్యులని అల్ సయ్యారి భద్రతా అధికారులు ధృవీకరించారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







