'ఖైదీ నెంబర్ 150' విడుదల సందర్భంగా హాలీడే!....
- January 09, 2017
మెగాస్టార్ రీఎంట్రీ సినిమా 'ఖైదీ నెంబర్ 150' విడుదల సందర్భంగా హడావిడి మామూలుగా లేదు.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో కూడా ఈ సినిమా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాభిమానులందరూ ఈ సినిమా గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా 'ఖైదీ నెంబర్ 150' ఫీవర్ రియాద్‌కు కూడా పాకింది. అక్కడి తెలుగువారు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'ఖైదీనెంబర్ 150' విడుదల సందర్భంగా ఒమాన్‌లోని అల్ రియాద్ కన్స్ట్రక్షన్ & ట్రేడింగ్ యల్.యల్.సి కంపెనీ మేనేజర్ రాందాస్ చందాకా తమ ఉద్యోగులకు జనవరి 11న సెలవు దినంగా ప్రకటించారు.ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. గతంలో కబాలి సినిమాకు కూడా ఇలాగే పలు కంపెనీలు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి…
- ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు
- అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- కువైట్ వెదర్ అలెర్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- సోహార్‌లోని కార్మికుల వసతి గృహంలో అగ్నిప్రమాదం..!!
- ట్రంప్ శాంతి మండలిలో చేరిన ఖతార్..!!
- బంగారం ధర $5,000కి చేరుకుంటుందా?
- బహ్రెయిన్ ఆటమ్ ఫెయిర్..24 దేశాల నుండి 600 మంది ఎగ్జిబిటర్లు..!!







