ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారతీయుల క్షమాభిక్షకు భారత ప్రభుత్వం ప్రయత్నం
- January 09, 2017
ఖతార్‌లో ఉరి శిక్ష పడిన ఇద్దరు భారతీయులను రక్షించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. తమిళనాడుకు చెందిన అలగప్ప సుబ్రమణ్యం, చెల్లదురై పెరుమాళ్ ఉపాధి కోసం ఖతార్ వెళ్ళారు. అయితే అక్కడ ఓ మహిళను హత్య చేయడంతో ఖతార్ సుప్రీం కోర్టు వారిద్దరికి ఉరి శిక్ష, మరో నిందితుడు శివకుమార్‌కు 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది.
అయితే సుబ్రమణ్యం, పెరుమాళ్ క్షమాభిక్ష కోసం భారత రాయబార కార్యాలయం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ రెండు కుటుంబ సభ్యుల విన్నపంతో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. తమిళుల క్షమాభిక్ష కోసం ప్రయత్నిస్తున్నట్లు సోమవారం ఆమె ట్వీట్ చేశారు. దీని కోసం ఖతార్ నుంచి నివేదిక తెప్పించుకున్నామని, తమిళనాడు ప్రభుత్వం సహకరించాలని సుష్మా స్వరాజ్ కోరారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా







