మూతపడనున్న మిలిటరీ కోర్టులు
- January 09, 2017
పాకిస్థాన్లో సైనిక కోర్టులు మూతపడనున్నాయి. వాటి గడువును పొడిగించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2014లో పెషావర్ సైనిక పాఠశాలపై ఉగ్రవాదులు దాడి చేసి వందకుపైగా విద్యార్థులు, సిబ్బందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడి కేసులపై సత్వర విచారణకు మిలిటరీ కోర్టులను పాక్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని కోసం రాజ్యాంగానికి 21వ సవరణ చేసింది. 2015 జనవరి 7న నుంచి రెండేళ్ళపాటు సైనిక కోర్టులు అమలులో ఉంటాయని పేర్కొంది. రెండేళ్ళలో సుమారు 274 కేసులను విచారించిన మిలిటరీ కోర్టులు 161 మందికి మరణ శిక్ష విధించాయి. ఇందులో 12 మందికి శిక్షలు అమలు చేశాయి. 113 మంది దోషులకు జైలు శిక్ష విధించాయి. అయితే ఈ ఏడాది జనవరి 7తో మిలిటరీ కోర్టుల గడువు ముసిగింది. దీంతో వీటి గడువు పెంచేది లేదని పాక్ అంతర్గత మంత్రి చౌదరి నసిర్ అలీఖాన్ స్పష్టం చేశారు. విచారణలో ఉన్న కేసులను తీవ్రవాద వ్యతిరేక కోర్టులకు బదిలీకి చేయనున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







