త్వరలో ఇంటర్నేషనల్ ఎక్సేంజ్‌ను ప్రారంభించనున్న మోదీ
- January 09, 2017
భారత్‌లోనే వేల కోట్ల ఆఫ్‌షోర్ బ్యాంకింగ్ కార్యలాపాలను నిర్వహించుకునేందుకు వీలుగా ఇంటర్నేషనల్ ఎక్సేంజ్‌ను ప్రధాని నరేంద్రమోదీ త్వరలోప్రారంభించనున్నారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని ఫైనాన్స్ జిల్లా పరిధిలో 16 అంతస్థుల భవనాన్ని ఇందు కోసం నిర్మించారు. మోదీ కలల ప్రాజెక్టుగా దీన్ని పేర్కొనవచ్చు. జనవరి 16 నుంచి ఈక్విటీ ఇండెక్స్ ఫ్యూచర్స్‌తో ప్రారంభించి అనంతరం బంగారం, వెండి, రాగి, చమురు, కరెన్సీ రంగాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించనుందని బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రతినిధులు తెలిపారు. ప్రతి ఏటా వేల కోట్ల ఈక్విటీ ఫ్యూచర్స్ వ్యాపారం సింగపూర్, దుబాయ్, హాంగ్‌కాంగ్‌లకు తరలిపోతోంది.దీన్ని అడ్డుకోవడంతో పాటు భారత్‌లోనే వీటి వ్యాపార నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు.ఆఫ్‌షోర్ కేంద్రాల్లో ఏటా భారత కంపెనీలు 48 బిలియన్ డాలర్ల మేర లావాదేవీలు జరుపుతుంటారు. గిఫ్ట్‌సిటీగా పేర్కొన్న ప్రాజెక్టుకు సంబంధించి అనేక రాయితీలు కల్పించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!







