మూతపడనున్న మిలిటరీ కోర్టులు

- January 09, 2017 , by Maagulf
మూతపడనున్న మిలిటరీ కోర్టులు

పాకిస్థాన్‌లో సైనిక కోర్టులు మూతపడనున్నాయి. వాటి గడువును పొడిగించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2014లో పెషావర్ సైనిక పాఠశాలపై ఉగ్రవాదులు దాడి చేసి వందకుపైగా విద్యార్థులు, సిబ్బందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడి కేసులపై సత్వర విచారణకు మిలిటరీ కోర్టులను పాక్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని కోసం రాజ్యాంగానికి 21వ సవరణ చేసింది. 2015 జనవరి 7న నుంచి రెండేళ్ళపాటు సైనిక కోర్టులు అమలులో ఉంటాయని పేర్కొంది. రెండేళ్ళలో సుమారు 274 కేసులను విచారించిన మిలిటరీ కోర్టులు 161 మందికి మరణ శిక్ష విధించాయి. ఇందులో 12 మందికి శిక్షలు అమలు చేశాయి. 113 మంది దోషులకు జైలు శిక్ష విధించాయి. అయితే ఈ ఏడాది జనవరి 7తో మిలిటరీ కోర్టుల గడువు ముసిగింది. దీంతో వీటి గడువు పెంచేది లేదని పాక్ అంతర్గత మంత్రి చౌదరి నసిర్ అలీఖాన్ స్పష్టం చేశారు. విచారణలో ఉన్న కేసులను తీవ్రవాద వ్యతిరేక కోర్టులకు బదిలీకి చేయనున్నట్లు ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com