బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌ ఏషియా..!!

- January 09, 2017 , by Maagulf
బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌ ఏషియా..!!

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా ఇండియా తన ప్రయాణికులకు అతి తక్కువ ధరకే టికెటు అందిస్తున్నట్లు ప్రకటించింది. '2017 ఎర్లీ బర్డ్‌ సేల్‌' పేరుతో రూ.799లకే ప్రారంభ ధర నిర్ణయించింది. 2017 మే 1 నుంచి 2018 ఫిబ్రవరి 6 వరకు ప్రయాణించే వారికి ఈ ఆఫర్‌ వరిస్తుందని, జనవరి 15న ఆఫర్‌ ముగుస్తున్నట్లు ప్రకటించింది.
* బెంగళూరు-కొచ్చీకి రూ.999. 
* ఇంఫాల్‌-గువాహటీకి రూ.799. 
* కొచ్చీ-హైదరాబాద్‌ రూ.1,499. .
* హైదరాబాద్‌-గోవా రూ.1499.

* ఛండీగఢ్‌-బెంగళూరు మధ్య రూ.2,999గా టికెట్‌ ధరను నిర్ణయించింది.

విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోవటంతో వారిని ఆకట్టుకునేందుకు ఎయిర్‌లైన్స్‌ పలు ఆఫర్లను ప్రకటిస్తోంది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ తెలిపిన వివరాల ప్రకారం 2016 జనవరి నుంచి నవంబర్‌ వరకు విమాన ప్రయాణం చేసే వారి సంఖ్య 23 శాతం పెరిగిందని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com