చిన్నప్పటి సెల్ఫ్ కంట్రోల్, పెద్దయ్యాక సూపర్ పవర్

- April 18, 2015 , by Maagulf
చిన్నప్పటి సెల్ఫ్ కంట్రోల్, పెద్దయ్యాక సూపర్ పవర్

చిన్నతనం నుంచీ మీ పిల్లల్లో ‘సెల్ఫ్‌ కంట్రోల్‌’ అలవాటు చేయండి, పెద్దయ్యాక తాము ఎన్నుకున్న రంగంలో, ముఖ్యంగా ఉద్యోగాల వేటలో మీ పిల్లల్ని మెరికల్లా చూసుకోవచ్చని అంటోంది ఓసర్వే. స్కాట్‌లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ స్టిర్లింగ్‌ రీసెర్చర్‌ మైఖేల్‌ డాలీ తాము చేపట్టిన సర్వే ఫలితాల్ని విశ్లేషించి ఈ వాస్తవాన్ని వెల్లడిరచాడు. 15 వేల మంది బ్రిటిష్‌ చిల్డ్రన్‌ని ఈ సర్వే కోసం ఎంపిక చేశారు. ఏడేళ్ళ వయసున్న పిల్లల నుంచి శాంపిల్స్‌ తీసుకుని, వారిలోని ఇంటెలిజెన్స్‌ లెవల్స్‌నీ, ఎనలిటికల్‌ మైండ్‌నీ అంచనా వేశారు. సామాజిక బాధ్యత గురించి కూడా వారిని ప్రశ్నించారు. చివరికి, వాటన్నిటినీ క్రోడీకరించి రీసెర్చర్స్‌ ఓ అవగాహనకి వచ్చారు. చిన్నప్పుడు తక్కువ సెల్ఫ్‌ కంట్రోల్‌ ఉన్న పిల్లలు, పెద్దయ్యాక జాబ్‌ని సంపాదించడంలో పట్టుదలతో వుండలేరనీ, జీవితం పట్ల అవగాహన వారికి తక్కువగా ఉంటుందని తేల్చారు. అదే సెల్ఫ్‌ కంట్రోల్‌ విషయంలో ముందున్న పిల్లలు, పెద్దయ్యాక జీవితంలో ఎదగడానికి కసితో వుంటారనీ, ఉద్యోగాన్వేషణలో వారి ఆలోచనలు పాదరసంలా కదులుతాయని రీసెర్చర్స్‌ కనుగొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com