ఆగస్టులో ధ్రువ నక్షత్రం....

- January 09, 2017 , by Maagulf
ఆగస్టులో ధ్రువ నక్షత్రం....

చెన్నై: కొంతకాలంగా గౌతం మేనన్‌ 'ధ్రువ నక్షత్రం' నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారు. తొలుత సూర్యతో తెరకెక్కించాలని భావించారు. ఆ తర్వాత పలువురు హీరోలను దాటుకుని విక్రం చేతికొచ్చింది. నిజానికి 'ఇరుముగన్‌' సినిమా తర్వాత విజయ్‌చందర్‌ దర్శకత్వంలోని ఓ సినిమా, ఆ తర్వాత హరి దర్శకత్వంలోని 'సామి 2'లో విక్రం నటిస్తారని వార్తలొచ్చాయి. అయితే 'సామి 2' కన్నా ముందుగానే 'ధ్రువ నక్షత్రం' చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు విక్రం. ఈ సినిమా కమల్‌ నటించిన 'వేట్టైయాడు విళయాడు' తరహాలో ఉంటుందని సమాచారం. చిత్రీకరణ పూర్తిగా విదేశాల్లోనే జరగనుంది.
ఇందులో విక్రం.. జాన్‌ అనే గూఢచారి పాత్రలో నటించనున్నారు. రానున్న ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కన్నా ముందుగా విజయ్‌చందర్‌ దర్శకత్వంలోని చిత్రం విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com