యాహూ పేరు మారుతోంది.. కొత్త పేరేమిటంటే!....
- January 09, 2017
ఇంటర్నెట దిగ్గజ సంస్థగా పేరొందిన యాహూ ఇంక్ తన పేరును మార్చుకోబోతున్నట్టు సోమవారం ప్రకటించింది. కొత్త పేరుగా అల్టాబా ఇంక్ గా నామకరణం చేయనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా వెరిజోన్ కమ్యూనికేషన్ ఇంక్ తో కుదుర్చుకున్న డీల్ ముగిసిన అనంతరం కంపెనీ బోర్డు నుంచి యాహూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెరిస్సా మేయర్ రాజీనామా చేయబోతున్నట్టు వెల్లడించింది. యాహూ తన కోర్ ఇంటర్నెట్ బిజినెస్లు డిజిటల్ అడ్వర్ టైజింగ్, మీడియా ఆస్తులు, ఈమెయిల్ వంటి వాటిని ప్రముఖ వైర్ లెస్ దిగ్గజం వెరిజోన్ కు విక్రయించిన సంగతి తెలిసిందే. 4.83 బిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ.32,491.41 కోట్లకు యాహు ఇంటర్నెట్ ఆస్తులను వెరిజోన్ కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ డీల్ సమయంలోనే యాహూ సీఈవో మెరిస్సా మేయర్ రాజీనామా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. అయితే తాను మాత్రం కంపెనీలోనే ఉండదలుచుకున్నట్టు పేర్కొన్నారు. కానీ డీల్ ముగిసిన అనంతరం ఆమె రాజీనామా చేయనున్నట్టు యాహూ సంస్థనే సోమవారం తెలిపింది.
వెరిజోన్ , యాహూతో ఈ డీల్ కుదుర్చుకున్న తర్వాత ఆ కంపెనీలో రెండుసార్లు అతిభారీ మొత్తంలో డేటా చోరి జరిగినట్టు వెల్లడైంది. మొదటిసారి 500 మిలియన్ కస్టమర్ అకౌంట్లు, రెండోసారి 100 కోట్లకు పైగా అకౌంట్లు చోరికి గురైనట్టు తెలిసింది. దీంతో వెరిజోన్ యాహూతో కుదుర్చుకున్న డీల్ లో మార్పులు చేయనున్నట్టు లేదా ఆ లావాదేవీలను ఆపివేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే యాహూతో తాము బలమైన వ్యూహాత్మక సంబంధాలు కలిగి ఉంచుకోవడానికే చూస్తున్నామని, డేటా ఉల్లంఘనల గురించి ప్రస్తుతం యాహూ విచారణ చేపట్టిందని వెరిజోన్ ఎగ్జిక్యూటివ్ లు పేర్కొన్నారు. ఈ డీల్ పూర్తయిన అనంతరం ఐదుగురు యాహూ డైరెక్టర్లు రాజీనామా చేయనున్నట్టు కూడా యాహూ మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. మిగతా డైరెక్టర్లు అల్టాబాను పాలించనున్నారని, కొత్త కంపెనీ బోర్డు చైర్మన్ గా ఎరిక్ బ్రాండ్ట్ నియమించామని యాహు వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







